![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి చేరుకుంది. హౌస్ లో అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్ ఈ ఐదుగురు ఫినాలేకి చేశారు. వచ్చే ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్-8 విజేతను ప్రకటించడానికి ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేయగా.. శుక్రవారం అర్థరాత్రితో విన్నర్‌ని తేల్చే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. ఈవారమే బిగ్ బాస్ ఓట్లు వేయడానికి చివరి వారం కావడంతో ఓట్లు భారీగా పడుతున్నాయి.
తొలొరోజు ఓటింగ్ లో మొత్తం అయిదుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ఓటింగ్ మొత్తం ఇద్దరికే షిఫ్ట్ అయ్యింది. ఆ ఇద్దరే నిఖిల్, గౌతమ్. తొలిరోజు ఓటింగ్‌లో ఈ ఇద్దరూ.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.
అఫీషియల్ పోల్స్ లెక్కల్ని పక్కన పెడితే.. అన్ అఫీషియల్ పోల్స్‌లో మాత్రం.. నిఖిల్-గౌతమ్ ఇద్దరూ హోరా హోరీగా ఓటింగ్ సాధిస్తున్నారు. కొన్ని పోల్స్‌లో నిఖిల్ ముందుంటే.. మరికొన్ని పోల్స్‌లో గౌతమ్ ముందున్నాడు. మొత్తం ఓటింగ్‌లో 80 శాతం ఓట్లు వీళ్లిద్దరికే పడుతుండటంతో.. మిగిలిన ముగ్గురూ రేస్‌లో నామమాత్రంగానే ఉన్నారు.
నిఖిల్, గౌతమ్‌ల మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. ఏ పోల్ చూసినా కూడా.. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో విన్నర్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ప్రతి సీజన్‌లోనూ టాప్ 5 ఫైనలిస్ట్‌ల ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తరువాత.. తొలిరోజు ఓటింగ్ చూస్తే విన్నర్ ఎవరనేది క్లారిటీ వచ్చేసేది. కానీ.. గౌతమ్, నిఖిల్‌లు ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ జరగడంతో ఈ ఇద్దరు తొలిరోజు ఫైట్‌లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. తాజా పోల్స్ చూస్తే.. గౌతమ్ 37 శాతం ఓట్లతో టాప్‌లో ఉంటే.. నిఖిల్ 33 శాతం ఓట్లు సాధించాడు. ప్రేరణ 13 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే.. నబీల్ 11 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక అవినాష్ కేవలం 4 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు.
![]() |
![]() |